రాజన్న రాజ్యం అంటే.. రైతులపై లాఠీ విరగడమేనా? నారా లోకేశ్
రాజన్న రాజ్యం అంటే విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలుచున్న రైతులపై లాఠీ విరగడమేనా అనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నిచారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు... రాష్ట్రానికి నీళ్లు తెస్తా అని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారితో చర్చలకు వెళ్లారట. అనంతపురం, విజయనగరం, నెల్లూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విత్తనాలో జగన్ గారు అంటూ రోడ్డెక్కుతున్నారు.
రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్‌లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్‌లో దెబ్బలు తినాలి అని మరో సారి గుర్తు చేశారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన మాని రైతులకు విత్తనాలు అందించే పని మొదలు పెట్టండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.