మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (17:13 IST)

ఆంధ్రా మోడీ కోసం సీబీఐ కాస్తా బీబిఐగా మారింది : లోకేష్ ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రా మోడీ (వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి) కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీబీఐను కాస్త బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (బీబీఐ)గా మార్చేసిందని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐను ప్రధాని మోడీ సర్కారు పూర్తిగా నీరుగార్చిందన్నారు. ముఖ్యంగా, ఆంధ్రా మోడీగా ఉన్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం సీబీఐని కాస్త బీబీఐ (బీజేపీ బ్యూరో ఇన్వెస్టిగేషన్)గా మార్చేశారని చెప్పారు. వేల కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్‌కు విముక్తి కల్పించాలన్న నిర్ణయంతోనే ప్రధాని మోడీ సీబీఐను నీరుగార్చారని ఆరోపించారు.