ఔను, నిజమే.. ఏపీలో 26 వేల మహిళలు మిస్సింగ్ : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 మంది మహిళలు మిస్సింగ్ అయిన మాట వాస్తవమేనని, అయితే, ఇందులో 23 వేల మందిని గుర్తించామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మిస్సింగ్ అయ్యారని ఆయన తెలిపారు. అయితే, కొందరు 30 వేల మంది మిస్సింగ్ అయినట్టు తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
రకరకాల కారణాలతో వీరంతా తప్పిపోయారని తెలిపింది. వారిలో 23 వేల మందిని గుర్తించగా, మిగిలిన వారి ఆచూకీని తెలిసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే, కొంతమంది ఏమాత్రం అవగాహన లేకుండా 30 వేల మంది అదృశ్యమయ్యారంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని గంజాయితో ముడిపెట్టడం సరికాదన్నారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ ఏజెన్సీలో గత యేడాది 7 వేల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామని ఆయన గుర్తుచేశారు.
విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా కాకుండా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఇపుడు గంజాయి విశాఖ నుంచి కాకుండా ఒరిస్సా నుంచి రాష్ట్రంలోకి సరఫరా అవుతుందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.