శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (13:49 IST)

ఏపీలో కరోనా స్ట్రెయిన్ వైరస్ : కర్నూలులో ఎన్440 కె వేరియంట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా స్ట్రెయిన్ పేరుతో జరుగుతున్న ప్రచారం అంత అబద్ధమని కోవిడ్ చికిత్స టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డా. చంద్ర శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్‌హెచ్ 44 అనే స్ట్రెయిన్ కోవిడ్ మొదటి దశలోనే ఉందని.. ఎన్‌హెచ్ 440కె అస్తిత్వం జనవరి తర్వాత దాదాపుగా తగ్గి పోయిందని వివరించారు. 
 
ఇప్పుడు బి1617, బి1178 అనేది ఇప్పుడు విస్తృతంగా ప్రబలి ఉందని వెల్లడించారు. వీటినే ఇండియన్ స్ట్రెయిన్ అంటున్నారని, సీసీఎమ్.బి. నివేదికలో ఏపీ స్ట్రెయిన్ అన్న ప్రస్తావనే లేదన్నారు. కొంత మంది రెమిడెసివిర్ ను విచ్చలవిడిగా వాడుతున్నారని.. పాజిటివ్ వచ్చిన మొదటి 7 రోజుల్లో వాడితేనే రెమిడెసివిర్ పని చేస్తుందన్నారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు. ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. 
 
ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు.  ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీలైనంత వరకు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని నిపుణులు సూచన చేస్తున్నారు.