శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 14 డిశెంబరు 2020 (19:08 IST)

తిరుమల శ్రీవారి సేవలో నూతన వధూవరులు నిహారిక- చైతన్య

తిరుమలలో శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు నూతన దంపతులు చైతన్య-నిహారిక. ఆలయానికి చేరుకున్న ఈ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ఈ మధ్యే గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. ఈ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో గల విలాస్‌లో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. అలాగే ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది.
 
ఈ కార్యక్రమానికి మెగా కుటుంబం మొత్తం వచ్చింది. చిరంజీవితో మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులు కావడంతో సెంటిమెంట్‌గా శ్రీవారిని దర్సించుకున్నారు. నూతన జంటను ఆసక్తిగా భక్తులు చూశారు.