గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (11:00 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాలు - రూ.1046 కోట్లతో 18 వంతెనలు

nitin gadkari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చల్లని చూపుచూస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల విజ్ఞాపనల కేంద్రం.. కోరిన కోర్కెలన్నీ తీర్చుతున్నారు. తాజాగా మరో వరం ప్రకటించింది. మొత్తం రూ.1046 కోట్ల వ్యయంతో 18 వంతెనలు నిర్మిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. ఏపీలో వంతెనల నిర్మాణాల పురోగతిపై సభకు తెలిపారు. 
 
జాతీయ రహదారి 216ఏపై మోరంపూడి, జొన్నవాడ, ఉండ్రాజవరం జంక్షన్, తెతలి, కైకరం వద్ద నిర్మిస్తున్న  ఐదు వంతెనలు 2025 ఏప్రిల్ 2వ తేదీనాటికి పూర్తవుతాయి చెప్పారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6వ తేదీ నాటికి విశాఖపట్టణం ఎయిర్ పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ 2025 ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఎన్.హెచ్.16పై గొలగపూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్‌లో నిర్మిస్తున్న రెండు వంతెనలు 2025 సెప్టెంబరు 11వ తేదీ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. 
 
అలాగే, జాతీయ రహదారి 16పై నాలులుప్పపాడు గ్రోత్ సెంటర్, రాజుపాళెం జంక్షన్ వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాాలకు అనుమతి ఉత్తర్వులు ఇచ్చామని, ఇదే జాతీయ రహదారిలో రాజుపాళెం క్రాస్ రోడ్డ్, జొన్నతాళి క్రాస్ రోడ్డు, చెవ్వూరు క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్‌తో పాటు ఎన్.హెచ్.44పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణానికి బిడ్లు పిలిచామని వివరించారు. ఎన్.హెచ్.16లో శ్రీసిటీలో జీరో పాయింట్, చిల్లకూరు సెంటర్ వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణాలకు బిడ్లు పిలవాల్సి ఉందని గడ్కరీ తెలిపారు.