శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (13:23 IST)

అమెరికాలో నూజివీడు ఇంజనీర్ దుర్మరణం

అమెరికాలో నూజివీడు ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. పదేళ్ల క్రితం కెనడాకు వెళ్లిన హరీశ్ చౌదరి అనే ఇంజనీర్ ఈ నెల 11వ తేదీన తన స్నేహితులతో కలిసి జలపాత సందర్శనకు వెళ్లాడు. అక్కడ ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడి జలపాతంలో కొట్టుకునిపోయాడు. 
 
ఈ నెల 8వ తేదీన ఐదుగురు స్నేహితులతో కలిసి హరీశ్ చౌదరి విహార యాత్రకు వెళ్లాడు. 11వ తేదీన న్యూయార్క్‌లోని ఇతాకా జలపాతం సందర్శనకు వారంతా కలిసి వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసుకుంటుండగా, ప్రమాదవశాత్తు వెనక్కి జారిపడి జలపాతంలో పడిపోయాడు. 
 
నీటి ఉధృతి అధికంగా ఉండటంతో హరీష్ చౌదరి నీటిలో పడి కొట్టుకుని పోయాడు. అమెరికాలోని తానా ప్రతినిధుల సాయంతో హరీశ్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.