ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (11:53 IST)

పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలకు నిప్పు

బాపులూరు మండలం అంపాపురంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. అంపాపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న రుచి పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రొక్లెయిన్, ట్రాక్టర్ పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యాయి. 
 
భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.