ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జులై 2024 (19:36 IST)

జగన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు.. తప్పించుకుని పారిపోయారు.. పవన్ (video)

Pawan kalyan
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్‌పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు. 
 
రూ.15000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని.. అయితే రాష్ట్రంలో ఎన్నోవేల కోట్లు మద్యంలో దోపిడి జరిగిందని, ఆ సోమ్ము వచ్చి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేదన్నారు. ఇంత దోపిడీ చేసిన వారిని ఎట్టి పరిస్ధితుల్లో వదల కూడదని అన్నారు. 
 
"జగన్ రెడ్డికి అదృష్టం బాగుంది. అందుకే బుధవారం వాళ్లు ఇక్కడ లేకుండా తప్పించుకొని పారిపోయారు.. ఇక్కడ ఈ సీటులో జగన్ వుండి వుంటే ఆయనకు చుక్కలు చూపించేవారిమని చెప్పారు.

తప్పు చేసిన వారిని స్వేచ్ఛగా వదిలేయకూడదని పవన్ అన్నారు. తప్పు చేసిన వారు శిక్షించబడాలి.. అప్పుడే క్లీన్ గవర్నెన్స్ చేసిన వారమవుతామని పవన్ చెప్పుకొచ్చారు.