ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (17:24 IST)

హక్కుల సాధన కోసం జేఏసీ... పోటీ చేయకపోవడం బాధేస్తోంది : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం సంయుక్త కార్యాచరణ కమిటీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం సంయుక్త కార్యాచరణ కమిటీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లుపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు భిన్నవాద‌న‌లు చెబుతున్నారనీ, వీటిలో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియడం లేదన్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో యూపీఏ ప్ర‌భుత్వం ఏపీకి న్యాయం చేయ‌లేద‌న్నారు. 
 
అలాంటి ప‌రిస్థితుల్లో తాను ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చుతార‌ని, అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉన్న న‌రేంద్ర‌ మోడీ, చంద్ర‌బాబు నాయుడుల‌ను స‌మ‌ర్థించాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర త‌ర్వాత కూడా ప్ర‌త్యేక హోదా గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెలుసుకున్నాన‌ని తెలిపారు.
 
ప్ర‌త్యేక హోదాపై తాను తిరుప‌తి, కాకినాడల్లో స‌భ‌ల్లో అడిగానని పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్ని రోజుల‌కి ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌న్నారు. ప్ర‌త్యేక హోదాను టీడీపీ నేత‌లు ఒక‌సారి బాగుందంటారు, ఒక‌సారి బాగోలేద‌ని అంటారని విమ‌ర్శించారు. మాట‌ల‌తో చాలా తిక‌మ‌క చేస్తున్నారని చెప్పారు.
 
అందుకే ఏపీ హక్కుల సాధన కోసం సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ వంటి మేధావులతో ఒక జేఏసీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే, గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయక పోవడం పట్ల ఇపుడు బాధపడుతున్నట్టు చెప్పారు.