శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:19 IST)

పవన్ పంచ్‌లు.. నేనెవరో తెలియదా.. సంతోషం... అంటూ ట్వీట్

జనసేనాన్ని పవన్ కల్యాణ్ మరోమారు టీడీపీ నేతలపై పంచ్‌లు పేల్చారు. జనసేన జెండా రాష్ట్రంలో ఎక్కడా లేదనీ, అసలు పవన్ కల్యాణ్ గురించి ఆలోచించే సమయమే తమకులేదంటూ గురువారం ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్య

జనసేనాన్ని పవన్ కల్యాణ్ మరోమారు టీడీపీ నేతలపై పంచ్‌లు పేల్చారు. జనసేన జెండా రాష్ట్రంలో ఎక్కడా లేదనీ, అసలు పవన్ కల్యాణ్ గురించి ఆలోచించే సమయమే తమకులేదంటూ గురువారం ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. గతంలో కూడా కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతిరాజు ఓ సందర్భంలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అంటో ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను చర్చనీయాంశమయ్యాయి కూడా. 
 
ఇపుడు ఈ ఇద్దరి పేర్లను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. "అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియ‌దు.. మంత్రి పితాని గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటో తెలియ‌దు.. సంతోషం" అని ప‌వ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌ను ప‌వ‌న్ అభిమానులు విప‌రీతంగా రీట్వీట్ చేస్తున్నారు. 'వాళ్లు మీ ద‌గ్గ‌రికి వ‌చ్చి త‌మ‌ను తామే ప‌రిచ‌యం చేసుకునే రోజు త్వ‌ర‌లో వ‌స్తుంది అన్నా!', 'నువ్వేంటో చూపించే టైమ్ వ‌చ్చింది అన్నా!' అంటూ ప‌లువురు అభిమానులు ఈ ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారు.