గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (14:04 IST)

మేకుల బాబా బండారం బయటపడింది.. మహిళను అలా..?

woman
మూఢనమ్మకాలను, బాబాలను నమ్మే వారు ఇంకా వుండనే వున్నారు. తాజాగా మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. నకిలీ బాబా మోసం ఘటన విజయవాడలో కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. తిరిగి అమ్ముడు పోలేదు. ఈ క్రమంలో మేకుల బాబాను రజనీకి ఓ మహిళ పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు. 
 
100 గంజాలు అమ్ముడుపోయేలా చేసి 4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని బెదిరించాడు. ఈ మేకుల బాబా వేధింపులు పెరగడంతో ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన వద్ద రూ.రెండున్నర లక్షల వరకు తీసుకుని బాబా పూజలు చేసినట్లు బాధితురాలు పేర్కొంటోంది.