శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 26 మే 2018 (22:10 IST)

వైఎస్‌ జగన్‌ను పోసాని కృష్ణ ముర‌ళి క‌లుసుకోవ‌డానికి కార‌ణం..?

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొని వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలిపారు పోసాని. ఇది ఇటు సినీ, రాజ‌కీయ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింద

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొని వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలిపారు పోసాని. ఇది ఇటు సినీ, రాజ‌కీయ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ముక్కుసూటిగా మాట్లాడే పోసాని, జ‌గ‌న్ మోహన్ రెడ్డిని క‌లుసుకోవ‌డానికి కార‌ణం ఏమిటి..? త్వ‌ర‌లో జ‌గ‌న్ పార్టీలో చేర‌బోతున్నారా అనేది హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఈ రోజు (శ‌నివారం)  వైఎస్‌ జగన్‌ 172వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఉదయం నైట్‌ క్యాంపు(ఆకివీడు) నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్‌ జగన్‌... కుప్పనపుడి, కోలనపల్లి  మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కాళ్ల చేరుకున్నాక విరామం తీసుకున్నారు. లంచ్‌ క్యాంపు అనంతరం సీసలి క్రాస్‌ రోడ్డు నుంచి మళ్లీ పాదయాత్ర కొన‌సాగించి  వైఎస్‌ జగన్ జక్కారంలో పాదయాత్ర ముగించి అక్కడే రాత్రికి బస చేస్తున్నారు. మ‌రి.. పోసాని జ‌గ‌న్ క‌లుసుకోవ‌డం గురించి ఏం చెబుతారో చూడాలి.