1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (13:56 IST)

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ప్రాక్టికల్స్ ముందు.. పరీక్షలు...?

students
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్. ఇంటర్ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. థియరీ పరీక్షల కంటే ముందుగానే ప్రాక్టికల్స్ పరీక్షలు పెట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో వుంది. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కొత్త షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ ప్రకటించే అవకాశం వుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఇది వరకే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సు వుంది. 
 
కాగా మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ఏపీలో జరుగనున్నాయి. ఈ పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయి. కానీ ప్రాక్టికల్స్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం వుంది.