బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మే 2024 (22:22 IST)

వర్మ కోసం రంగంలోకి ప్రభాస్ పెద్దమ్మ..

shyamala devi
నరసాపురంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌ వర్మ కోసం ఎన్నికల ప్రచారంలో ప్రభాస్‌ పెద్దమ్మ, దివంగత రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి మద్దతు తెలిపారు.

మొగల్తూరు, నరసాపురంలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. శ్రీనివాస్ వర్మకు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. శ్రీనివాస్ వర్మ చాలా కాలంగా బిజెపిలో కీలక నాయకుడిగా ఉన్నారు. అలాగే పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ సీటు ఈయనకు కేటాయించింది. 
 
అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవికి ఇప్పటికే వైసిపి పార్టీ వాళ్లు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించినా నో చెప్పినట్లు సమాచారం. అయితే శ్యామలాదేవి టిడిపి కూటమికి మద్దతు పలికినట్లు ప్రకటించింది.