శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2019 (10:46 IST)

ప్రియాంక రెడ్డి కేసు: ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో ప్రియాంక రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌లను సస్పెండ్ చేస్తు పోలీసు కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణపై వారిని విధుల నుంచి తప్పించారు. హత్యకు ముందు ప్రియాంక రెడ్డి తన సోదరితో ఫోనులో మాట్లాడారు. తాను ఉన్న పరిస్థితిని వివరించారు. 
 
ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించారని ముగ్గురిపై ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
 
గోడ కూల్చివేత...
ప్రియాంక రెడ్డిపై దారుణం జరిగిన స్థలంలోని గోడను పోలీసులు కూల్చివేశారు. ప్రియాంక రెడ్డిని నాలుగు వైపుల ప్రహారీ గోడ ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పోలీసులు ఆ గోడను కూల్చివేశారు. 
 
ప్రియాంక హత్య జరిగిన స్థలంలో స్థానికులు దీపాలు వెలిగించి ఆమె ఫొటోకు శ్రద్ధాంజలి ఘటించారు నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు పోలీసులను కోరారు.