శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 నవంబరు 2019 (12:32 IST)

నరసింహా స్వామి సేవలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టీస్ మహేశ్వరి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయనతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పూజలు నిర్వహించడం జరిగింది. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకులు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
 
స్వామివారి అంతరాలయంలో చీఫ్ జస్టిస్ గోత్రనామాలతో పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని ముడుపులు చెల్లించుకున్నారు. వేదపండితులు చీఫ్ జస్టిస్ మహేశ్వరిని ఆశీర్వదించారు. ఆలయ ఈవో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ విశిష్టత గురించి వివరించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు.