మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:29 IST)

రామాయపట్నం పోర్టు కోసం తాత్కాలిక సర్వే

ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులల్లో భాగంగా మండల పరిధిలోని సముద్రతీర ప్రాంతాలని రెవెన్యూ అధికారుల బృందం తాత్కాలిక సర్వే నిర్వహించింది.

పోర్టు పరిధిలోని గుడ్లూరు మండలంలోని గ్రామాలైన ఆవులవారిపాలెం మెండివారిపాలెం సాలిపేట, మూర్తిపేట కర్లపాలెం, రావూరు, చేవూరు సరిహద్దులోని గ్రామాల్లో కందుకూరు డివిజన్‌ పరిధిలోని 23 మంది తహసీల్దార్లు, ఇతర కింది స్థాయి సి బ్బందితో కలిసి మొత్తం 24 తాత్కాలిక సర్వే బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో మంగళవారం సర్వే నిర్వహించారు.

పరిశ్రమల ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో అధికారుల బృందం సదరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ ప్రాథమిక సమాచారం సేకరించారు. అనంతరం భూములకు సంబంధించి  రెవెన్యూ రికార్డులను పరిశీలించి రైతుల వివరాలు సేకరించారు. త్వరలో గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.