1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (09:16 IST)

అంతరిక్షంలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 56

pslvc56
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీ సీ-56 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం నిర్వహించారు. సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను దీని ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికి మూడు దశలు విజయవంతమైనట్లు శా
స్త్రవేత్తలు ప్రకటించారు. 
 
కాగా, శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించగా, ఆదివారం ఉదయం 6.31 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన 960 కిలోల బరువు గల డీఎస్-సార్ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ షార్‌కు శుక్రవారం రాత్రే చేరుకొని కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించి ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
 
ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్య ప్రయోగం కావడం విశేషం. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్లోని రెండో, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం, హీలియం గ్యాస్ నింపే ప్రక్రియను పూర్తి చేసిన శాస్త్రవేత్తలు... అన్ని దశల పనితీరును క్షుణ్నంగా పరిశీలించారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన తర్వాత 535 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్లో ఉపగ్రహాలను విడిచిపెట్టనుంది.