బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 5 ఆగస్టు 2021 (19:42 IST)

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పులిచింత‌ల గేటు మ‌ర‌మ్మ‌తు

పులిచింతల ప్రాజెక్ట్‌లో దెబ్బ తిన్న 16వ గేట్‌ను ఆంద్ర‌ప్ర‌దేశ్ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఉదయభాను ప‌రిశీలించారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఈ తెల్ల‌వారుజామున వ‌ర‌ద ఉధృతికి 16వ నెంబర్ గేట్ ఊడి ప‌డిపోయింది. ఈ విష‌యం తెలిసి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ విప్, కృష్ణా క‌లెక్ట‌ర్ జె.నివాస్ హుటాహుటిన‌ పులిచింతల ప్రాజెక్టును సంద‌ర్శించారు.

యుద్ధ ప్రాతిపదికన డ్యాం అధికారులు గేటు మరమ్మతులు చేపడుతున్నారు. డ్యాం నుండి నదిలోకి 5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అయ్యే అవకాశం ఉంది.