మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:27 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన రాహుల్ యాత్ర

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనుంది. ఇప్పటికే తమిలనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోకి పూర్తి చేసుకున్న ఈ యాత్ర శుక్రవారం ఏపీలోకి ప్రవేశించింది. 
 
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ సరిహద్దుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. 
 
ఈ భారత్ జోడో యాత్ర కాసేపట్లో డి.హీరేహాళ్ చేరుకోనుంది. రాహుల్ గాంధీ డి.హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సాయంత్రం ఓబుళాపురం మీదుగా ఆయన మళ్లీ కర్నాటక రాష్ట్రంలోని బళ్లారికి బయల్దేరతారు.