శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:10 IST)

సీఎం జగన్, ఎంపీ విజయ సాయిల‌కు ఊర‌ట‌... బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ కొట్టివేత‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణం రాజుకు పెద్ద షాక్ త‌గిలింది. సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు, ఎంపీ  విజయ సాయి రెడ్డికి ఊరట ల‌భించింది. జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. 
 
సీఎం జగన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, పేర్కొంటూ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ కొట్టివేసింది. అయితే, ఈ విష‌యం ముందే సాక్షి మీడియాకు ఎలా లీక్ అయింద‌ని, ర‌ఘురామ తీర్పు నిలిపివేయాల‌ని వేసిన పిటిష‌న్ కూడా హైకోర్టు కొట్టివేయ‌డంతో, ఆర్.ఆర్.ఆర్. కు రెండు ర‌కాలుగా షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.