మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 10 జనవరి 2019 (19:51 IST)

రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ కుమారుడు - లక్ష్మీపార్వతి

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రెండు బయోపిక్‌లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి కథానాయకుడు నిన్న విడుదల కాగా ఇంకొకటి లక్ష్మీస్ ఎన్టీఆర్. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాంగోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. వైసిపి నేత రాకేష్‌ రెడ్డి నిర్మాత. సినిమా ప్రారంభంలోనే వివాదాలకు దారితీసింది లక్ష్మీస్ ఎన్టీఆర్. 
 
అయితే తిరుపతిలో లక్ష్మీపార్వతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడుపై తనకు ఉన్న కోపాన్ని బయటపెట్టారు లక్ష్మీపార్వతి. కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు బాలక్రిష్ణ న్యాయం చేయలేకపోయారని, ఎన్టీఆర్ లాగా నటించడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు లక్ష్మీపార్వతి. 
 
చంద్రబాబునాయుడుకు సరైన గురువు రాంగోపాల్ వర్మ అని.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో బాబు చరిత్ర మొత్తం బయటపెడుతున్న రాంగోపాల్ వర్మ పూర్వ జన్మలో ఎన్టీఆర్ కుమారుడు అయ్యి ఉండవచ్చని చెప్పారు లక్ష్మీపార్వతి. బాలక్రిష్ణ నటిస్తున్న కథానాయకుడు రెండవ భాగంలో నిజ జీవిత చరిత్ర లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు లక్ష్మీపార్వతి.