మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (12:43 IST)

హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే.. ఆర్జీవీ ఫైర్

Ram Gopal Varma
గుంటూరులో తొక్కిసలాట ఘటనపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. షేర్ చేసిన వీడియోలో చంద్రబాబు నాయుడుకు ప్రజల ప్రాణాలు లెక్క లేదంటూ దర్శకుడు ఆర్జీవీ ఆరోపించారు. తన పాపులారిటీ తగ్గిపోయిందని అందరికీ తెలిసిపోతుందన్న భయంతోనే నాయుడు ఇరుకు వీధుల్లో, చిన్న మైదానాల్లో సభ నిర్వహించారని ఆరోపించారు. 
 
చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చంద్రబాబు ప్రజలను కుక్కల్లాగా చూస్తూ బిస్కెట్లు విసిరారని మండిపడ్డారు. చిన్న వీధిలో సభ ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదా అని నాయుడుని ప్రశ్నించారు. వ్యక్తిగత అహం కారణంగా, ఫోటో ఫోజుల కోసం ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారని ఆరోపించారు. హిట్లర్, ముస్సోలినీ తర్వాత నాయుడే అలాంటి వ్యక్తి అంటూ ఆర్జీవీ విమర్శలు గుప్పించారు.