బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 మే 2020 (07:38 IST)

కరోనా సేవలకు రోబో..ఎక్కడ?

ఆధునిక యుగంలో అన్నింటికీ సాంకేతికతే. ఇప్పుడు కరోనా బాధితులకు సేవలందించేందుకు రోబోలను ప్రవేశపెడుతున్నారు.

తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోబో సేవలు ప్రారంభమయ్యాయి. చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన 'ఆర్‌బాట్‌-20' రోబో మిషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ చాంబర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మందులు, భోజనం, వాటర్‌ బాటిల్స్‌ తదితర సామాగ్రిని అందించనుందన్నారు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌, చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.