నెల్లూరులో రొట్టెల పండుగ.. ఇచ్చిపుచ్చుకుంటే కోరికలు నెరవేరుతాయ్
నెల్లూరులో రొట్టెల పండుగ శనివారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ఏటా నిర్వహించే రొట్టెల పండుగకు 12 లక్షల మంది హాజరయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కోరిన కోర్కెలు తీర్చే పండుగగా రొట్టెల పండుగకు ఎంతో పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి పండుగలో పాల్గొంటారు.
రొట్టెల పండుగ రోజున స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. మనసులో కోరుకుని రొట్టెను పుచ్చుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం.