శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (15:59 IST)

ట్రక్కులను నడిపెటోళ్లు.. బస్సులెట్ల నడుపుతరు?

శిక్షణ లేని టెంపరరీ డ్రైవర్లు ఆర్టీసీ బస్సులను నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, టెంపరరీ కండక్టర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ అడ్వకేట్​ కె. గోపాలకృష్ణ హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. వారికి 90 రోజుల శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ఆదేశించాలని కోరారు. ఈ పిల్​ సోమవారం చీఫ్​ జస్టిస్​ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ అభిషేక్‌‌‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ముందు విచారణకు వచ్చింది. 
 
ప్రతివాదులైన చీఫ్‌‌‌‌ సెక్రటరీ, రవాణా శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ, ఆర్టీసీ ఎండీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను నాలుగువారాలకు వాయిదా వేస్తున్నామని, అప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రైవేటు బస్సులు, ట్రక్కులను నడిపే వారు ఆర్టీసీ బస్సులను నడిపించగలరనే అపోహలో అధికారులున్నారని, లోడ్‌‌‌‌తో ఉన్న లారీని నడిపేందుకు, ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే ఆర్టీసీ బస్సును నడిపేందుకు తేడా ఉంటుందని పిటిషనర్​ కోర్టు దృష్టికి తెచ్చారు. ఎంవీ యాక్టు-1988 సెక్షన్‌‌‌‌ 3 ఆయా వాహనాలకు ఉండే తేడాలను స్పష్టంగా వివరించిందన్నారు.
 
ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు రవాణా వాహనాల బ్రేక్‌‌‌‌ వ్యవస్థ ఎలా ఉంటుందో ఆయన వివరిస్తూ.. ప్రైవేట్‌‌‌‌ డ్రైవర్లకు ఆర్టీసీ బస్సు బ్రేక్‌‌‌‌ వ్యవస్థపై అవగాహన ఉండదని తెలిపారు. సమ్మె కారణంగా టెంపరరీ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడిపించడం వల్ల నల్గొండ, కరీంనగర్, సిద్దిపేట, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో బస్సులు ప్రమాదాలకు గురయ్యాయని, పలువురు మృతిచెందగా అనేకమంది గాయపడ్డారని పిటిషన్​లో ప్రస్తావించారు. 
 
మరణించి, గాయపడిన వారి కుటుంబాలకు ఆర్టీసీ ఆర్థిక సాయం అందించాలని అందులో కోరారు. శిక్షణ ఇవ్వకుండా టెంపరరీ డ్రైవర్లు, టెంపరరీ కండక్టర్లను నియమించుకునేందుకు వీల్లేదన్నారు. టెంపరీరీ కండక్టర్లు ప్రయాణికుల నుంచి చార్జీలు తీసుకుని టికెట్లు ఇవ్వడంలేదని, ఒకవేళ టికెట్‌‌‌‌ ఇచ్చినా గమ్యస్థానం వరకు ఇవ్వడం లేదని, టికెట్ల సొమ్మును చాలామంది టెంపరరీ కండక్టర్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
కండక్టర్‌‌‌‌గా పనిచేసేవారికి చట్టంలోని సెక్షన్‌‌‌‌ 19 ప్రకారం తగిన సర్టిఫికెట్‌‌‌‌ ఉండాలనే రూల్‌‌‌‌ను అమలు చేయలేదని తెలిపారు.  తాత్కాలిక సిబ్బంది హైదరాబాద్​లోని చందానగర్‌‌‌‌లో ఒక ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. వాదనలపై స్పందించిన డివిజన్​ బెంచ్​ చీఫ్‌‌‌‌ సెక్రటరీ, రవాణా శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ, ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీకి నోటీసులిచ్చింది.