శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (16:45 IST)

జగన్ పాలనను చూసి ఓర్వలేకపోతున్న బాబు, సజ్జల విమర్శ

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా, అవినీతికి తావు లేకుండా ప్రజలంతా నా వాళ్లే అనే భావనతో సాగుతున్న సీఎం జగన్‌కు ప్రజాదారణ పెరుగుతుందని, జగన్ పాలనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
చంద్రబాబు గారు వయస్సుతో మీ మెదడు ఎంత దెబ్బతిన్నదో అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. మీది పచ్చి రాజకీయం కాదా అని విమర్శించారు. చెదురుమదురు ఘటనలను దళితులపై దాడులుగాను, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హిందూ వ్యతిరేక చర్యలుగా ప్రచారం చేసి అందులో లబ్ధి పొందాలనుకోవడం సరికాదు.
 
ఏదో రకంగా పార్టీల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి మీరు, మీ మీడియా వేసిన పన్నాగం కాదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.