సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:44 IST)

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు? చంద్రబాబు కీలక నిర్ణయం

టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సీనియర్ నేత అచ్చెన్నాయుడిని నియమించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని పలువురు నేతలు అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
 
ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పంధించారని సమాచారం. మరోవారం పదిరోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తిచేసిన టీడీపీ ఇప్పుడు లోక్‌సభ నియోజక వర్గాల వారీగా కమిటీలు నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది.
 
మరో వారం రోజుల్లో ఈ కమిటీలను, ఆ తరువాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అలాగే రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది.