కీలక నిర్ణయం తీసుకున్న ఎస్.బి.ఐ - ఏపీపీఎస్సీ అభ్యర్థులు హర్షం
భారత రిజర్వు బ్యాంకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-2 పరీక్షకు హాజరుకావాల్సిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూపు-2 పరీక్ష జరగాల్సివుంది. ఈ పరీక్ష రాసే వారికి మార్చి 4న ఎస్బీఐ మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 9 గంటలకు లోపు పరీక్ష తేదీ మార్పునకు దరఖాస్తు చేయాలని సూచన చేసింది.
ఎస్బీ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకేరోజు ఉంటాయని పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఎస్పీఐ పరీక్షను మరో రోజు రాసేందుకు అనుమతి ఇచ్చింది. పాత షెడ్యూల్ ప్రకారం ఏపీ గ్రూపు-2, ఎస్బీఐ పరీక్ష క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) మెయిన్స్ పరీక్షలు ఈ నెల 25వ తేదీన నిర్వహించాల్సివుంది.
అయితే, పరీక్ష తేదీ మార్చాలంటూ ఎస్బీఐకి ఏపీపీఎస్సీ లేఖ రాసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్.బి.ఐ... ఈ నెల 25వ తేదీన గ్రూపు-2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4వ తేదీన మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. పరీక్ష తేదీ మార్పు కోసం అభ్యర్థులు ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటల లోపు https://ibpsonline.ibps.in/sbijaoct23/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.