సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (19:08 IST)

వంగలపూడి అనితకు షోకాజ్ నోటీసులు.. టీడీపీ చిర్రుబుర్రు

Anita
ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వంగలపూడి అనితకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ పాదయాత్రలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసు ఇచ్చారని ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ప్రెస్ మీట్‌లో 2024లో జగన్‌‌ను మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ సిద్ధం కావాలనే ఉద్దేశంతో అనిత మాట్లాడటంతో తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు, మహిళ నాయకుల్లో ఒకింత షాక్‌కు గురైయ్యారని తెలిసింది. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇక అనిత చేసిన సదరు వ్యాఖ్యలపై 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలనే నోటీసు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ నోటీసు వైకాపా కుట్ర అంటూ టీడీపీ ఫైర్ అయ్యింది. 
 
ఇదంతా వైకాపా కుట్ర అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడింది. వైసీపీ మీడియా సృష్టించిన ఫోర్జరీ లేఖ ఇదంటూ... ఏం జగన్ రెడ్డి! ఇదేనా నీ రాజకీయం? అంటూ టీడీపీ ఘాటుగా స్పందించింది.