ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (08:56 IST)

నంద్యాలలో టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి సతీమణి మృతి!!

murder
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో దారుణం జరిగింది. ప్రత్యర్థులు చేసిన దాడిలో టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం మంగళవారం జరిగింది. సమాచారం అందుకున్న ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి శ్రీదేవి మృతదేహానికి నివాళులు అర్పించారు. 
 
మరోవైపు, భాస్కర్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరో గుర్తించలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో టీడీపీ నేత కటుంబంపై పాశవికంగా దాడి జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
మలంద్వారంలో దాచిన బంగారం.. గుర్తించిన ఎయిర్‌పోర్టు అధికారులు... 
 
బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసుకునేందుకు స్మగ్లర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా, విదేశాల నుంచి ప్రయాణికులతో ఈ బంగారాన్ని అక్రమంగా పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు బంగారాన్ని తన మలంద్వారంలో దాచి తీసుకొచ్చాడు. దీన్ని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
అబుదాబి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, మలంద్వారంలో బంగారాన్ని దాచినట్టు గుర్తించారు. మలంద్వారంలో రూ.59 లక్షల విలువ చేసే 806 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అబుదాబి నుంచి అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.