శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (17:59 IST)

తిరుమలలో ఘోరం: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలిక మృతి

తిరుమలలో ఘోరం చోటుచేసుకుంది. బాలాజీనగర్‌లో నీటి సంపులో పడి ఆరేళ్ల బాలిక మృతిచెందింది. బాలాజీనగర్‌ 6వ లైన్‌లో 689 నెంబరు ఇంట్లో ఇద్దరు కుమార్తెలతో కలిసి భానుప్రకాష్‌, జయంతి దంపతులు ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె శశికళ(6) ఇంట్లో అడుకుంటూ ఉండగా తల్లిదండ్రులు బయట ఉన్నారు. కొంతసేపటి తర్వాత శశికళ ఇంట్లో కనిపించలేదు. 
 
అనుమానంతో భానుప్రకాష్‌ దంపతులు ఇంట్లోని నీటి సంపులో పరిశీలించగా శశికళ మునిగిపోయి కనిపించింది. ఆమెను బయటకు తీసి అశ్విని ఆస్పత్రిలోని అపోలో అస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.