సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వేశాఖ
సంక్రాంతి పండుగ వేళ్ల ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ కారణంగా అనేక రైళ్లు 10 నుంచి 150 నిమిషాల వరకు ముందుగానే చేరుకుంటాయని పేర్కొంది. ఈ మేరకు పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపింది.
గత కొంతకాలంగా ట్రాక్‌ల బలోపేతం చేయడంతో పాటు ఇంటర్ లాకింగ్ పనులు కూడా కూడా తరచుగా చేపడుతూ వస్తున్నారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ విదానాన్ని కూడా తీసుకొచ్చారు. దీంతో రైళ్ల ఆలస్యం తగ్గడంతో పాటు వేగం పెరిగింది. ఈ ప్రభావం డివిజన్ పరిధిలోని పలు ముఖ్య మార్గాల్లో నడిచే రైళ్లపై పడింది. ఇపుడు ఈ పనులు పూర్తికావడంతో విజయవాడ డివిజన్ పరిధిలో మొత్తం 26 రైళ్ల వేగాన్ని పెంచారు. వీటిలో విజయవాడకు చేరుకునే ఐదు రైళ్లు ఉన్నాయి.