గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (12:12 IST)

విశాఖ నుంచి స్వదేశానికి బయలుదేరిన దక్షిణ కొరియావాసులు... అసలేంటి కథ

విశాఖపట్నం ఎల్జీపాలిమర్స్ లో మే నెల 7 తారీఖున విషవాయువు లీక్ అవడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సంఘటన ఎలా జరిగిందో కారణాలు తెలుసుకునేందుకు ఎల్జి పాలిమర్స్ 8 మంది సభ్యులతో కూడిన బృందం మే నెల 13 వ తారీఖున సౌత్ కొరియా నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.

జరిగిన సంఘటనపైన విశాఖజిల్లా కోర్టులో కేసు అవడంతో ఆ బృందాన్ని విశాఖ నగరం విడిచి వెళ్లకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వారు అప్పటి నుంచి విశాఖపట్నంలోనే ఉండి హైకోర్టును ఆశ్రయించారు.

వారికి హైకోర్టు వారి సొంత దేశమైన సౌత్ కొరియా వెళ్ళటానికి ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొరియా వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సౌత్ కొరియా బయలుదేరారు.