శ్రీ పద్మావాసిని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ పద్మావాసిని అలంకారంలో దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం రాత్రి ఆలయ ప్రాంగణంలోనే ఊంజల్‌సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.