బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (18:33 IST)

మానవత్వం చాటుకున్న కర్నూలు జిల్లా శ్రీశైలం పోలీసులు, చివరివరకూ బ్రతికించాలని చూశారు...

నట్టడవిలో శ్రీశైలం భీముని కొలను వద్ద ఊపిరాడక పడి ఉన్న భక్తుడిని కాపాడేందుకు శ్రీశైలం ఒన్ టౌన్ ఎస్సై హరి ప్రసాద్, పోలీసు సిబ్బంది ప్రయత్నించారు. నల్లమల అడవిలో భక్తుడు (వేద మూర్తి S/o. కట్టె గౌడ, బొమ్మనహల్లి గ్రామం, బళ్ళారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం) తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరి ఆడక పడిపోగా గమనించిన కొందరు డయల్ 100కి కాల్ చేశారు.
 
స్థానిక శ్రీశైలం పోలీసులు వెంటనే అక్కడికి ఆక్సిజన్, వైద్య సిబ్బందిని వెంటపెట్టుకొని వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం అందించి అతడిని భుజాలపై ఎత్తుకొని కైలాస ద్వారం వరకు తీసుకొని వెళ్ళారు. దారి మధ్యలోనే భక్తుడు కోలుకోలేక  మరణించాడని కైలాస ద్వారం వద్ద  వైద్యులు నిర్ధారించారు.