బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2017 (20:33 IST)

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు... మంత్రి సోమిరెడ్డి

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, ఆ శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవశాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ కడప ఉక్కు ఫ్యాక్టర

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, ఆ శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవశాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంభందించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డ, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి సిహెచ్. ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా పార్లమెంటు, శాసన మండలి, శాసన సభ్యులు, కేంద్ర సైన్స్ & టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్, ఆశాఖ కార్యదర్శి శ్రీమతి అరుణ శర్మలతో గురువారం పార్లమెంటులో కలసి చర్చించినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.
  
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు సి.ఎం రమేష్ అధికార నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సోమిరెడ్డి సమావేశ వివరాలను పాత్రికేయులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 13వ షెడ్యూల్‌ను అనుసరించి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయక సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. 
 
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై మికాన్ సంస్థ ఇచ్చిన నివేదికను పరిశీలించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో సంబందిత రాష్ట్ర శాఖ మంత్రి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈనెల 27వ తేదిన మరోకదఫా సమావేశమై సమగ్రంగా చర్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  ఫీజబిలిటి నివేదిక ననుసరించి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి చేసిన విజ్జ్ఞాపన మేరకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు కమిటీ, మికాన్ సంస్థలు పునః సమీక్షించి సత్వరమే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు.
  
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, భూమి, నీరు, రవాణ వంటి మౌలిక వసతులను కల్పించుటకు సంసిద్ధంగా వున్నదని, ముడి ఇనుము రవాణ కొరకు సుమారు 130 కిలోమీటర్లు రైలు మార్గం ఏర్పాటు చేయవలసి వున్నదని, ఇందుకు సంభందించిన వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని కేంద్ర మంత్రికి సూచించినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. కడపలో ఏర్పాటు చేయబోయే ఉక్కు పరిశ్రమకు సమీపంలోనే బయ్యారం ఉక్కు గనులు, జలరవాణాకు కృష్ణపట్నం ఓడరేవు ఎంతో అనుకూలంగా వున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు సి.ఎం రమేష్, ప్రభుత్వ విప్ మల్లిఖార్జున రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.