ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సూర్యనారాయణరాజు నామినేషన్ దాఖలు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) గురువారం శాసన మండలి భవనంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన పేరును ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు.
ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, దివంగత పెనుమత్స సాంబశివరాజు తనయుడు సూర్యనారాయణ రాజును అభ్యర్థిగా సిఎం జగన్ నిర్ణయించారు.
దీంతో సురేష్‌బాబు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి సుబ్బారెడ్డికి దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి సురేష్‌బాబు వెంట రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కోరుముట్ల శ్రీనివాసులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణరాజు (సురేష్ బాబు)కు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బీ ఫారమ్ అందజేశారు.