శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (10:01 IST)

సీఎం జగన్‌కు హిందూ మతమంటే నచ్చదు : శ్రీనివాసానంద సరస్వతి

Swami Srinivasananda Saraswati
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి హిందూమతమంటే ఏమాత్రం నచ్చదని అందుకే ఆయన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరుకాలేదని ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. 
 
ఇదే విషయంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందూమత సంప్రదాయాలను గౌరవించడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం క్రైస్తవమత భావాలు కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్తు అధ్యక్షుడైన శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. 
 
కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉన్నప్పటికీ కాలు బెణికిందనే నెపంతో వెళ్లకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆ తర్వాత రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పార్టీ కార్యక్రమానికి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. 
 
ఈ ముఖ్యమంత్రి గత నాలుగేళ్ళలో ఒక్కసారైనా సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకుగానీ భార్యతో కలిసి వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారా? అని ప్రశ్నించారు. పేరుకే హిందువు అని చెప్పుకునే సీఎం జగన్.. పక్కా క్రైస్తవ వాది అన్నారు. w