బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 3 మే 2018 (11:06 IST)

టీడీపీకి గల్లా అరుణ కుమారి షాక్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. రాజీనామా

చంద్రగిరి నియోజక వర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని.. వయోభారం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చంద్రగిరి నియోజక వర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని.. వయోభారం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా తన కుమార్తె కానీ ఇతర కుటుంసభ్యులు కానీ చంద్రగిరి నుంచి పోటీ చేయబోరని స్పష్టం చేశారు. 
 
వయోభారం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పైకి ప్రచారం జరిగినా ఆమె అలకకు కారణం వేరని.. తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు లభించలేదని అందుకే గల్లా అరుణకుమారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉండి మంత్రిగా కొనసాగిన అనంతరం గత ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన గల్లా కుటుంబం పట్ల టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె భావిస్తున్నారట. 
 
తనని కాదని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అమర్నాధ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారనే అసంతృప్తి ఆమెలో వుందని.. అలాగే చిత్తూర్ ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు కాదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి ఇచ్చారనే కారణాలతో గల్లా అరుణ కుమారి చంద్రగిరి టీడీపీ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు గల్లా అరుణకుమారిని కోరినట్లు సమాచారం. కానీ గల్లా అరుణ కుమారి మాత్రం తాను తీసుకున్న నిర్ణయం పట్ల వెనక్కి తగ్గేది లేదని తెలుస్తోంది.