సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (14:20 IST)

చంద్రబాబు ఇంటికి వస్తే గేటు వద్దే శవాన్ని తిరిగి పంపిస్తాం : బుద్ధా వెంకన్న వార్నింగ్

గుడివాడలో వెలుగు చూసిన గోవా క్యాసినో వ్యవహరం ఇపుడు అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రధానంగా వైకాపా, టీడీపీ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని ఆత్మహత్య చేసుకోవడం కాదని జగన్ ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే ప్రజలే కొడాలి నానిని చంపేస్తారని చెప్పారు. అంతేకాదు, కొడాలి నాని.. చంద్రబాబు ఇంటికి వస్తే గేటు దగ్గరే చంపేసి శవాన్ని తిరిగి పంపిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 
 
ఇకపోతే, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు ఏపీ పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో చక్కగా పనిచేసి సవాంగ్ ఇపుడు మాత్రం జగన్ వంటి వ్యక్తి డైరెక్షన్‌లో తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, ఈయన రిటైర్డ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.