మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (16:11 IST)

టీడీపీ ఎమ్మెల్యే నాపై అత్యాచారం చేశాడు!! మహిళ (Video)

koneti aadimualm
చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్టానం ఆయనపై చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకుగాను పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యీ ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోను కూడా ఆమె మీడియా సమక్షంలో అమె ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.