1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:16 IST)

గుడి, బడి అనే తేడా లేదు... కక్షసాధింపే వీళ్ళ నైజం!

పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మద్రసాను  సీజ్ చేయడం దుర్మార్గం అని, ఏపీ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని టి.డి.పి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
 
 
వై.సీ.పీ నేతల ఆరాచకాలకు గుడి, బడి అనే వ్యత్యాసం కూడా లేద‌ని, వై.సీ.పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మైనారీటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయ‌న్నారు. రాష్ట్రంలో ఏదోఒక చోట బడుల మీద దాడులు జరుగుతున్నాయ‌ని, ఇప్పటికే ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేసి, ఎయిడెడ్ విద్యాసంస్థల భూములను దోచుకోవడానికి వేలాది మంది జీవితాలతో ఆటలాడుతోంద‌న్నారు. 
 
 
మదరసా స్థలాలపై ప్రభుత్వం కన్ను పడింద‌ని,  వేలాది ఎకరాల వక్ఫ్ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నార‌ని బాబు ఆరోపించారు. వక్ఫ్ బోర్డు స్థలాలను రక్షించలేని వైసీపీ ప్రభుత్వం స్థలాన్ని లీజుకు తీసుకొని సేవ భావంతో విద్యార్దులకు విద్యను అందిస్తున్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ నడిపించే మద్రసా పై వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యం రాజకీయ కక్ష సాధింపులో భాగమే. 


 మైనారీటీల అభ్యునతి కోసం, వక్ఫ్  భూముల రక్షణ కోసం ఏర్పాటైన వక్ఫ్ బోర్డు లో పనిచేసే అధికారులు విచక్షణ రహితంగా మద్రసాలో పిల్లల నిత్యావసర వస్తువులు,  కూరగాయలు బయట పడేసి మద్రసాను సీజ్ చేసిన తీరు చాలా బాధాకారం.  దురుసుగా వ్యవహరించిన వక్ఫ్ బోర్డు అధికారి మహబూబ్ బాషాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా మద్రసాను యధావిధిగా కొనసాగించాల‌ని చంద్ర‌బాబు డిమాండు చేశారు.