ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (11:24 IST)

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

విద్యాబుద్ధులు చెప్పాల్సిన కొందరు గురువారం విచక్షణను కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నపాటి తప్పులు చేసే విద్యార్థులపట్ల ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు విద్యార్థులు హోం వర్క్ చేయలేదని చెప్పుతో కొట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ధర్మవరంలోని జీనియస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయురాలు వారిని చెప్పుతో కొట్టారు. విషయం తెలిసిన బాధిత విద్యార్థులు పాఠశాలకు చేరుకుని అనితను ప్రశ్నిస్తూ దాడి చేశారు. 
 
విద్యార్థులను చెప్పుతో కొట్టడం ఏమిటని పాఠశాల యాజమాన్యం నిలదీశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రికత్త నెలకొంది. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు స్కూలు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఎంఈవో గోపాల్ నాయక్ స్పందించారు. విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు.