శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (16:29 IST)

చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్టు ఇస్తానని ప్రకటించారు. ఈ గిఫ్టు ఏంటో ట్విట్ట‌ర్ ద్వారా బ‌య‌ట‌పెట్టిన వ‌ర్మ‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మ‌హా కూటమికి మ‌ద్ద‌తుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్రచారం చేయ‌డం.. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. 
 
ఈ ఎన్నిక‌ల‌ నేపథ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు కానీ.. ఆ రిట‌ర్న్ గిఫ్ట్ ఏంటో చెప్ప‌లేదు. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఘోరపరాభవం మూటగట్టుకున్న నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైనశైలిలో ట్విట్ట‌ర్‌లో స్పందించారు. 
 
చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఇంత‌కీ వ‌ర్మ ఏమ‌ని ట్వీట్ చేసారంటే.. ఒక ఫోటోను పోస్ట్ చేసారు. అందులో జగన్ చిత్రపటాన్ని కేసీఆర్ తన స్వహస్తాలతో చంద్రబాబుకు అందిస్తున్నట్టుగా ఉంది. ఆ ఫొటో పై రిటర్న్‌గిఫ్ట్ అని రాసి ఉంది.