శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (14:20 IST)

మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట .. కేసు కొట్టివేత

srilakshmi
ఆంధ్రప్రదేష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై సీబీఐ అధికారులు నమోదు చేసిన మైనింగ్ కేసులో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమకానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. 
 
సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి గత 2004-09 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమంయలో మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించడమే కాకుండా భారీ మొత్తంలో ముడుపులు పొందారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు కేసు నమోదు అరెస్టు చేశారు. దీంతో ఒక యేడాది పాటు ఆమె జైలులో ఉన్నారు. 
 
తాజాగా ఈ కేసులో హైకోర్టు విచారించింది. శ్రీలక్ష్మిపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఆమె ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.