శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (12:02 IST)

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె... నేటికి 33వ రోజు

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 33వ రోజుకు చేరింది. మంగళవారం అర్థరాత్రితో సీఎం కేసీఆర్ కార్మికులకు ఉద్యోగాల్లో చేరేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో ఆందోళ ఉధృతం చేస్తామని ఆర్టీటీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 
 
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ రీజినల్ పరిధిలో విధుల్లో చేరిన వారు కేవలం 14 మందే. అయితే వరంగల్ రీజియన్ పరిధిలో సమ్మె బాటలో 4 వేలమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు.
 
మరోవైపు సూర్యాపేట ఆర్టీసీ డిపో గేట్ ముందు అఖిలపక్ష నాయకుల ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు వెళ్లకుండా గేట్ ముందు బైఠాయించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. 
 
మరోవైపు, కార్మిక సంఘాల నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా చర్చలతో పరిష్కారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏదైనా సమస్య పరిష్కారానికి ఇబ్బంది ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. భైంసా డిపో మేనేజర్‌పై జరిగిన దాడితో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపారు.