శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (12:40 IST)

స్మార్ట్ ఫోన్ పోయిందనీ ఉరేసుకున్న యువకుడు

స్మార్ట్ ఫోన్ పోయిందనీ ఓ యువకుడు ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్సీ కాలనీకి చెందిన అశోక్ అనే 17 యేళ్ల యువకుడు తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
 
కూలీ పనులకు వెళ్లడం ద్వారా సంపాదించుకున్న డబ్బుతో ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే దాన్ని పొగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమనస్తాపానికుగురైన అశోక్, కుడిచేతిని బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. 
 
ఈ విషయాన్ని గమనించిన తల్లి ఇరుగుపొరుగు వారిద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్న అశోక్ తల్లి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో అశోక్ తల్లి జయమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.