సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:44 IST)

సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు.. ధన్యవాదాలు: కేశినేని శ్వేత

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్‌లో గెలిచిన కేశినేని శ్వేత తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఏ ఇంటికి వెళ్లినా.. తనను సొంత బిడ్డలా చూసుకున్నారన్నారు. ప్రతీ గడప తిరిగానని.. ఇది మూడోసారని తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో తిరిగిన తాను.. తాజాగా 2021లో ఇలా మూడు సార్లు విజయవాడలోని గడప గడపా తిరిగానన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడ అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. రోడ్లను బాగు చేయకపోవడం, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదన్నారు.

కార్పొరేషన్ ఉద్యోగులకు సమయానికి జీతం ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికదేనని తెలిపారు. స్వచ్ఛ్ భారత్‌లో ఒకటో స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోయామని.. వైసీపీ నిర్వాకమే ఇదని అన్నారు.